హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ విజ్ఞతతో వ్యవహరించాలి: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు సూచించారు. తెలంగాణ ప్రాంతంలో జగన్ పర్యటించవద్దని, ఆయనను రానివ్వొద్దని తాను వ్యక్తిగతంగా చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ పర్యటించడానికి ఇది సందర్భం కాదని మాత్రమే అన్నానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో కేవలం వైఎస్‌ మృతి నేపథ్యంలో మరణించినవారి కుటుంబాలనే పరామర్శిస్తానని జగన్ చెప్పడం సరికాదని, తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసినవారి కుటుంబాలనూ పరామర్శిస్తానని చెప్పవచ్చు కదా అని ఆయన అన్నారు.

పార్లమెంటులో ఆయన సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేసి ప్లకార్డులు పట్టుకున్నారని అందుకే తెలంగాణవాదులు, విద్యార్థి సంఘాల నేతలు, తమ పార్టీ, తెలుగుదేశం నాయకులు జగన్ రాకను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తాను ఆంధ్ర ప్రాంతంలో పర్యటించే సందర్భంలో సమైక్యాంధ్ర కోసం మరణించినవారి కుటుంబాలనూ ఆదుకుంటామని చెబుతామని, దీనిపై ఉమ్మడి కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రాల సాధన కోసం మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని, అతి త్వరలోనే ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

తాను ఈనెల 29వ తేదీన విజయవాడకు వెళ్తానని, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తామని చేసిన ప్రకటనను అనేక మంది స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనికన్నా ముందు 28వ తేదీన ఆంధ్రరాష్ట్ర ప్రజా పార్టీ విజయవాడలోనే నిర్వహించనున్న సమావేశంలోనూ పాల్గొనే అవకాశముంది. ప్రజా పార్టీ నేత శ్రీనివాస్‌ కోరిక మేరకు కేసీఆర్‌ 28వ తేదీనే విజయవాడకు బయల్దేరి వెళ్లాలని యోచిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X