వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా యూనివర్సిటీకి 100 ఎకరాలు

రుద్రవరం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల పక్కనే ఉన్న సర్వే నంబర్లు 172 నుంచి 177, 182నుంచి 191, 266, 269 నుంచి 276లలోని 102.86 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ భూములను తాను పరిశీలించామన్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి 150 ఎకరాల భూమి సమకూరిందని తెలిపారు. మిగిలిన 50ఎకరాల భూమిని త్వరలోనే కేటాయిస్తారని ఆశిస్తున్నామన్నారు. రుద్రవరం సమీపంలో కేటాయించిన భూమిని చదును చేయాల్సి ఉందన్నారు. కృష్ణా యూనివర్సిటీని జిల్లాలో స్థాపించడానికి అప్పటి మంత్రులు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!