వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లాలో కెవిపి 'సునామీ'!

By Santaram
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హనుమాన్‌ జంక్షన్‌: ఆయన మంత్రి కంటే ఎక్కువ, ముఖ్యమంత్రి కంటే కొంచెమే తక్కువ. కృష్ణాజిల్లాలో ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకున్న తీరు ఆసక్తికరం. రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావును పలువురు ప్రముఖులు మంగళవారం అంపాపురంలోని ఆయన నివాసంలో కలిశారు. తన తండ్రి కోటగిరి వెంకట సత్యనారాయణ (బుచ్చినాయన) మూడో వర్ధంతిని స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఉదయం 9 గంటలకు తండ్రి వర్ధంతి కార్యక్రమాలను పూర్తిచేశారు. అనంతరం ఆయనను కలవడానికి వచ్చిన పలువురు ప్రముఖులతో ముచ్చటించారు.

కేవీపీని కల్సినవారిలో చింతలపూడి, ఏలూరు ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్‌, ఆళ్ల నాని, విజయవాడ సీపీ సీతారామాంజనేయులు, జిల్లా ఎస్పీ హరికుమార్‌, నూజివీడు ఏఎస్పీ బీ రాజకుమారి, ఎన్టీఆర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఏవీ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, పశ్చిమగోదావరి జిల్లా గవర్నమెంటు ప్లీడరు మద్దిపాటి సునీతలతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, అధికారులున్నారు.

అంపాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం నెలకొల్పాల్సిందిగా సర్పంచ్‌ కడియాల రమేష్‌ కేవీపీని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. కేవీపీ రాకను పురస్కరించుకొని సోమవారం రాత్రి నుంచి అంపాపురంలో భారీ పోలీస్‌బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌ నుంచి రైల్‌లో వచ్చిన కేవీపీకి విజయవాడ రైల్వేస్టేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ బాపులపాడు మండల అధ్యక్షుడు వేగిరెడ్డి బాలాజీ, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వరిగంజి కిషోర్‌, ఎస్‌ఎన్‌ పాలెం ఉపసర్పంచ్‌ అడపా అంజిబాబు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు చిన్నాల లకీనారాయణ, దుట్టా శివన్నారాయణ, వెలగపల్లిప్రదీప్‌, నూజివీడు మార్కెటింగ్‌ మాజీ డైరెక్టర్‌ దయాల విజయనాయుడు స్వాగతం పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X