వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూ.గోలో తొలగని తుపాను భయం

By Santaram
|
Google Oneindia TeluguNews

Heavy Rains
కాకినాడ: తుపాను కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు మరణించారు. 'లైలా' తుఫాను తీరం దాటినా మరో 24 గంటల వరకు ప్రమాదం లేకపోలేదనే సమాచారం జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలో 48 గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉప్పా డ, తొండంగి, పల్లిపాలెం, అంతర్వేది, శంకరగుప్తం తదితర ప్రాంతాలలో స ముద్ర అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు న ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంతాల లో సముద్రం 30 మీటర్ల మేర ముందు కు వచ్చి స్థానికులను భయకంపితుల ను చేస్తోంది. జిల్లాలో సగటు వర్షపాతం 1.7 సెంటీమీటర్లు, అత్యధికంగా కిర్లంపూడి మండలంలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీరంలోని మల్కిపురం, సనేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, యు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని నక్కా రామేశ్వరం, వాసాలతిప్ప, మాయాపట్నం, చిర్రయానాం, మాయాపట్నం, అమీనాబాద, సూరాడపేట తదితర గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డు రెండు కిలోమీటర్ల మేర కోతకు గురైంది.

ఈ రహదారిపైకి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో జిల్లా యంత్రాంగం రాకపోకలను నిలిపివేసింది. ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితిని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, జాయింట్‌ కలెక్టర్‌ కోన శశిధర్‌, ప్రత్యేకాధికారి జె.ఎస్‌.వి. ప్రసాద్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు పరిశీలించారు. ఇదే ప్రాంతాన్ని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విడిగా సందర్శించి బాధితులను పరామర్శించారు. అల్లవరం మండలంలో పరిస్థితిని గ్రామీణ నీటిసరఫరా మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎస్పీ జి. శ్రీనివాస్‌ సమీక్షించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యటించి బాధితులను పలకరించారు. జిల్లావ్యాప్తంగా 15 పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో 3,672 మందికి భోజన వసతి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కేంద్రాలలో భోజనం అనంతరం బాధితులు తిరిగి వెళ్లిపోతున్నారు. తుఫాను ప్రభావం తగ్గిందనే సమాచారంతో అధికారులు కూడా వారిని చూసీచూడనట్టు వదిలేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X