హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ సినీ నిర్మాత నవీద్అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మోసాలు చేస్తున్న నకిలీ నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. చెల్లని చెక్కులతో పలువురిని మోసం చేసిన ఘరానాదొంగ నవీద్‌ఖాన్‌ తో పాటు అతని కుటుంబం పోలీసులకు చిక్కింది. బంజారాహిల్స్‌ ఎస్సై నాగేశ్వర్‌ రావు మూడు రోజులపాటు బెంగళూరులో మాటువేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.1.70ల క్షల విలువ చేసే వస్తువులతో పాటు కొంత మంది అమ్మాయిల ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ రవీందర్‌ రెడ్డి, సీఐ సిద్దిఖీ, ఎస్సై కె.నాగేశ్వర్‌ రావు గురువారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడులోని వెల్లూరు జిల్లా అంబూర్‌కు చెందిన నవీద్ ‌ఖాన్‌ మార్బుల్‌ వ్యాపారం చేస్తుండేవాడు. నగరంలో కూడా వ్యాపారం చేయడం కోసం నిర్మాత అవతారం ఎత్తాడు.

అమ్మాయిల ఫొటోలు చూపించి సినిమా తీస్తానని పలువురికి చెప్పాడు. రామోజీ ఫిలింసిటీ, రామానాయుడు స్టూడియోకు తిరిగి తన మోసానికి మరింత బలం చేకూర్చాడు. ఇందులో భాగంగా ఈనెల 4న హైదరాబాద్‌ కు వచ్చి ఎమ్మెల్యే కాలనీలో అడ్వకేట్‌ చంద్రశేఖర్‌ ఇంటిని రూ. 50 వేల అద్దెతో తీసుకుని చెక్కులు ఇచ్చాడు. అదే విధంగా ఫర్నిచర్‌ కోసం ఎల్‌ జీ షోరూమ్‌ లో రూ. 3 లక్షల విలువ చేసే సామన్లు, ట్రినిటీ ట్రావెల్స్‌లో ఓ బెంజ్‌కారు అద్దెకు తీసుకుని రూ. 5 లక్షలకు అక్కడ కూడా చెక్కులు ఇచ్చి రూ. లక్ష అప్పు తీసుకున్నాడు.

ల్యాప్‌ టాప్‌ కొనుగోలకు కూడా చెక్కునే ఇచ్చాడు. కొద్ది రోజులకు బంజారాహిల్స్‌ రోడ్డు నెం.2లో అశోక్‌ అగర్వాల్‌ కు చెందిన కాంప్లెక్స్‌ని రూ. 22 కోట్లకు బేరం కుదుర్చుకుని, రూ. 18 కోట్లకు చెక్కులు ఇచ్చాడు. వీరందరికీ త్వరగా డబ్బులు వస్తాయంటూ బంజారాహిల్స్‌ బార్ ‌క్లెస్‌ బ్యాంకులో అకౌంట్‌ లు ఇప్పించాడు. అయితే నవీద్‌ ఇచ్చిన చెక్కులన్నీ వారం రోజుల్లో బౌన్స్‌ అయ్యాయి. ఇల్లు ఇప్పించిన బ్రోకర్ ‌కు కూడా రూ. 35వేల చెక్కును ఇవ్వగా అది కూడా బౌన్స్‌ అయ్యింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెంగళూరులో నిందితుడితో పాటు ఆయన భార్య, పని మనిషి, ఇద్దరు పిల్లలను బెంగుళూరులో ఎస్సై నాగేశ్వర్‌ రావు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ. 1.70 లక్షల విలువ చేసే వస్తువులు, కొంత మంది అమ్మాయిల ఫొటోలు లభ్యమయ్యాయి. నవీద్‌ నుంచి ఆరు పాస్‌ పోర్టులతో పాటు ఒక మిలియన్‌ యుఎస్‌ డాలర్లకు సంబంధించిన సర్టిఫికెట్ ‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ తో చాలా మందిని మోసగించినట్లు పోలీసులు వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X