వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
మంగుళూరు : విమాన ప్రమాదం సంభవించిన ప్రదేశానికి హెలికాప్టర్ లో బయలుదేరిన కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ప్రతికూల వాతావరణం అడ్డు వచ్చింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా హసన్ వద్ద దిగింది. యడ్యూరప్ప మంగుళూరు విమాన ప్రమాద ఘటన తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటన ప్రాంతానికి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హోంమంత్రి ఆచార్య, డీజీపీలతో పాటు ఆయన బయలుదేరారు.

అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో హసన్ వద్ద అత్యవసరంగా హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. దీంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మంగళూర్ కు ప్రయాణమయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల తమ హెలికాప్టర్ హసన్ లో దిగిందని, రోడ్డు మార్గం ద్వారా మంగళూర్ వెళ్తున్నామని యడ్యూరప్ప చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X