• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్యంబాబు పరారీపై కేసు నమోదు

By Pratap
|

Nalgonda Map
సూర్యాపేట: ఆయేషా మీరా హత్యకేసులో నిందితుడు సత్యంబాబు పరారీపై నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగాచేసి అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులందరినీ విజయవాడ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ విషయంపై వారిని విచారిస్తున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలో ఈ ఘటన జరగటంతో సూర్యాపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదుచేశారు. సత్యంబాబు పరుగెత్తలేడు, సరిగా నడవలేడు గానీ పాకడానికి వీలుందని సూర్యాపేట సిఐ లక్ష్మినారాయణ అంటున్నారు.

సత్యంబాబును పట్టుకోవడానికి పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. సత్యంబాబు పరారీకి ఇద్దరు కానిస్టేబుళ్లు సహకరించి ఉంటారని చెబుతున్నారు. కానిస్టేబుళ్ల సహకారంతో సత్యంబాబు పారిపోయి ఉంటాడని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X