విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యంబాబు మిస్సింగ్ పై విచారణ: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
విజయవాడ: విజయవాడ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు అదృశ్యంపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విచారణ జరిపించి అందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సత్యంబాబు పారిపోయాడనే విషయంపై పూర్తి వివరాలు తన వద్ద లేవని, వివరాలు అందిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతానని ఆమె అన్నారు.

కాగా, 2007 డిసెంబర్ 27వ తేదీన అయేషా మీరా హాస్టల్లో హత్యకు గురైంది. ఈ కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు సతీష్ పై ప్రధానమైన ఆరోపణ వచ్చింది. పోలీసులు తొలుత వంట మనిషి హత్యకు కారణమని చెప్పారు. ఆ తర్వాత అయేషా హత్య కేసులో నిందితుడిగా లడ్డూను అరెస్టు చేశారు. చివరగా 2008 మార్చిలో సత్యంబాబును అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. అయేషా హత్యకు తానే పాల్పడ్డానని సత్యంబాబు మీడియా ముందు చెప్పాడు. కానీ, ఆ తర్వాత తనను పోలీసులు కేసులో ఇరికించారని ప్రతిసారీ అరిచి చెబుతూనే ఉన్నాడు.

సత్యంబాబుకు 2008 ఆఖరులో నరాల వ్యాధి సోకింది. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లనే అతని ఆ వ్యాధి వచ్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. సత్యంబాబు తరఫు న్యాయవాదుల చొరవతో అతని హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స చేయించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అప్పటి నుంచి నిమ్స్ లో అతనికి చికిత్స చేయిస్తున్నారు. పోలీసుల సహాయంతో తప్ప నడవలేని స్థితిలో సత్యంబాబు ఉన్నాడు. తనంత తానుగా బాత్రూమ్ కు కూడా వెళ్లలేని దుస్థితి అతనిది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X