విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యంబాబు పరారీ కట్టుకథేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: అయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు పరారీ వార్తల వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పది మంది పోలీసుల ఎస్కార్టు ఉండగా అతను ఎలా తప్పించుకుని పారిపోయాడని అడుగుతున్నారు. నరాల వ్యాధితో నడవలేని స్థితిలో ఉన్న సత్యంబాబు పది మంది ఎస్కార్టు పోలీసులు ఉండగా ఎలా పరారీ అయ్యాడనేది ప్రధానమైన ప్రశ్న. పరారీ అయిన వెంటనే అతని కోసం ఎందుకు వెతకలేదని ప్రశ్నిస్తున్నారు. సత్యంబాబు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, అతను పరారీ అయిన విషయాన్ని ఎస్కార్టు పోలీసులు స్థానిక పోలీసులు ఎందుకు అందించలేదని అంటున్నారు.

సత్యంబాబు పరారీపై అతని తల్లి మరియమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సత్యంబాబును ఎన్ కౌంటర్ చేయడానికే ఈ కథ అల్లుతున్నారని ఆమె అంటోంది. సత్యంబాబు పరారీ అయ్యాడనే వార్త వెలువడిన కొద్దిసేపటికే అతన్ని వరంగల్ జిల్లా జనగామ పోలీసులు పట్టుకున్నారనే ప్రచారం జరిగింది. కేసును మాయ చేయడానికే సత్యంబాబు పరారీ కథ అల్లి అతన్ని చంపేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని అయేషా తల్లి షంషాద్ బేగం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కొనేరు రంగారావు మనవడు సతీష్, మరికొంత మందిని రక్షించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆమె అంటోంది.

సత్యంబాబు పరారయ్యాడనే వార్తలపై ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నరు. కృష్ణా జిల్లా అనాసాగరం గ్రామానికి చెందిన ప్రజలు కూడా పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సత్యంబాబు ఈ గ్రామానికి చెందినవాడే. సత్యంబాబు ఇంకా పోలీసుల అదుపులోనే ఉండవచ్చునని కూడా అంటున్నారు. సత్యంబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X