• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్యంబాబును పట్టుకున్న పోలీసులు

By Pratap
|

Krishna District Map
విజయవాడ: ఆయేషా మీరా హత్యకేసులో నిందితుడు సత్యంబాబును పోలీసులు శనివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద పట్టుకున్నారు. డ్రెస్ మార్చుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సత్యంబాబును పోలీసులు గుర్తించి జగ్గయ్యపేట వద్ద పట్టుకున్నట్లు సమాచారం. సత్యంబాబును విజయవాడకు తరలిస్తున్నారు. సత్యంబాబు శుక్రవారం రాత్రి సూర్యాపేటలో పోలీసులు కళ్లు గప్పి పారిపోయాడని పోలీసులు చెబుతున్న విషయం తెలిసిందే.

జగ్గయ్యపేటలోని ఇందిరా కాలనీలో సత్యంబాబును ఐడి పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. సత్యంబాబు సూర్యాపేటలో చేతులతో పాకుకుంటూ వెళ్లి లారీ ఎక్కి జగ్గయ్యపేటకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఒత్తిడికి తలొగ్గి పోలీసులే సత్యంబాబు దొరికినట్లు ప్రకటిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే, అసలు విషయం సత్యంబాబు నోరు విప్పితే తప్ప తెలియదు. అయితే పోలీసులు కూడా ఏమీ మాట్లాడడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X