హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేటూరి భార్యకైనా ఇల్లు ఇవ్వాలని వినతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Veturi Sundararama Murthy
హైదరాబాద్‌: ప్రముఖ గేయరచయిత వేటూరి సుందరరామమూరికి హైదరాబాద్‌ లో ఇల్లు లేదని, ఆయన భార్యకు ఇంటిని సమకూర్చి న్యాయం చేయాలని ప్రముఖ నటుడు, కరుణామయుడు ఫేం విజయచందర్ కోరారు. ఇటీవల వేటూరి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 30 ఏళ్ల నుంచి సినీపరిశ్రమలో ఉన్న తనకి హైదరాబాద్‌ ఫిల్మ్ ‌నగర్ ‌లో ఇల్లు లేదని బాధ వ్యక్తం చేశారని చెప్పారు. ప్రభుత్వం గానీ, సినీపరిశ్రమ ప్రముఖులు గానీ ఆయన భార్యకు అండగా ఉంటామని తెలుపుతూ ఇంటిని సమకూర్చి, ఆ తెలుగు కవికి న్యాయం చేయాలన్నారు. వేటూరి చనిపోలేదని, పాటల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటారని విజయచందర్ అన్నారు.

ప్రముఖుల నివాళి
వేటూరి సుందరరామమూర్తి భౌతికకాయాన్ని బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రి నుంచి అమీర్‌ పేట శ్రీనగర్‌ కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. సినీ ప్రముఖులు, ముఖ్యంగా రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం బన్సీలాల్‌పేట స్మశానవాటికలో అత్యక్రియలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X