హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినిమా పాటల రారాజు వేటూరి: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: సినిమా కవి వేటూరి జీవితం అజరామరమని ముఖ్యమంత్రి రోశయ్య కొనియాడారు. వేటూరిని తెలుగు సినీ పాటల రారాజుగా కీర్తించారు. వేటూరి మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ చరిత్రలో వేటూరు పేరు చిరకాలం ఉంటుందని, ఆయన సాహిదీ దురందరుడని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. తనకు వేటూరితో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని రోశయ్య చెప్పారు. తెలుగువారు గర్వించదగిన సాహితీవేత్త వేటూరి పాత్రికేయులుగా కూడా మెప్పు పొందారని కొనియాడారు.

చంద్రబాబు సంతాపం
వేటూరి మృతికి తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ చరిత్రలో, సాహితీ లోకంలో వేటూరికి ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన కొనియాడారు. వేటూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

చిరంజీవి దిగ్భ్రాంతి
వేటూరి మరణవార్త విని చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. పాటకు ప్రాణం పోసిన వేటూరి లేని లోటు తీర్చలేనిదని చిరంజీవి పేర్కొన్నారు. వేటూరి మృతి పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులపట్ల సానుభూతిని వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X