వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం బ్లాక్ బాక్స్ కోసం గాలింపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Air India Plane Crash
మంగళూరు: మంగళూరు విమానశ్రయంలో ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా ఎక్స్ ‌ప్రెస్‌ ఐఎక్స్‌ విమాన బ్లాక్ ‌బాక్స్‌ కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. బ్లాక్‌ బాక్స్‌ దొరికితే ప్రమాదానికి సంబంధించిన చిక్కుముడి వీడిపోతుంది. విమానప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న కేంద్రబృందాలకు సాయపడేందుకు అమెరికా పరిశోధన బృందాలు రంగంలోకి దిగనున్నాయి.

అమెరికాకు చెందిన నేషనల్‌ ట్రాన్ ‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు అధికారులతో పాటు బోయింగ్‌, జీఈ సంస్థల సిబ్బంది కూడా ఈ దర్యాప్తుకు సహకరించనున్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు తాము దర్యాప్తుకు సహకరిస్తున్నట్టు ఎన్‌టీఎస్‌బీ తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X