వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనలా అనలేదు: నరసింహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగులపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని తాను ఎప్పుడూ అనలేదని రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్ఎల్ నరసింహన్‌ స్పష్టం చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తన పర్యటన వెనుక ఎలాంటి ప్రత్యేక అజెండా లేదని చెప్పారు. తాను ప్రధాన మంత్రిని కలవొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. శిక్షణ తీసుకొని బయటికి వెళ్తున్న ప్రభుత్వాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ భుజస్కందాలపై బాధ్యతలున్నాయనీ ప్రజలు మీ నుంచి ఎంతో ఆశిస్తున్నారనీ అయితే కొన్నిసార్లు ప్రజావసరాలకు తగ్గట్టు మీరు స్పందించడం లేదన్న అభిప్రాయం ఉందనీ మీ భుజస్కందాలపై ఉన్న బాధ్యతలకు మీరే బాధ్యులు కాబట్టి చాలాజాగ్రత్తగా ఉండాలని మాత్రమే తాను అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాను కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపలేదనీ, అదంతా మీడియా సృష్టేనని అన్నారు. మీడియా సృష్టించిన వివాదానికి తానేం చేయాలని నవ్వుతూ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై లేఖలైతే రాశారు కదా? అని ప్రశ్నించినప్పుడు గుర్తు లేదని, అకస్మాత్తుగా ఇటువంటి ప్రశ్నలు వేస్తే తాను చెప్పలేనని ఆయన అన్నారు. ప్రధాన మంత్రిని రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా అడుగుతారా? అన్న ప్రశ్నకు ''చూద్దాం. ఏం చర్చకు వస్తుందో ఇప్పటివరకూ ఏమీ తెలియదు'' అని జవాబిచ్చారు. సంక్షేమ పథకాలు కొనసాగించడానికి ఆర్థిక సాయం కోరుతారా? అని అడిగినప్పుడు అది ముఖ్యమంత్రి చెప్పాలని, తాను జోక్యం చేసుకోబోనని అన్నారు. రాష్ట్రంలో నక్సల్‌ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వబోమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X