హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పార్టీకి కళా వెంకట్రావు గుడ్ బై

By Pratap
|
Google Oneindia TeluguNews

Kala Venkata Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీలో మరో వికెట్ పడిపోయింది. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి మాజీ మంత్రి కళా వెంకట్రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి పంపించారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలతో విసిగిపోయిన కళా వెంకటరావు పార్టీ రాజీనామా చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన ప్రజారాజ్యం పార్టీకి గుడ్ బై చెప్పారు.

కాగా, కళా వెంకటరావు సొంత గూటికి చేరనున్నారు. ఆయన ఈ నెల 26వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కళా వెంకటరావు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X