హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహబూబాబాద్ పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషనులో శుక్రవారం జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒక వ్యక్తి చెవి నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. అతను బతకడం కష్టమని వైద్యులంటున్నారు. అయితే, పరిస్థితిని అదుపు చేయడానికి విధులు నిర్వహిస్తున్న పోలీసులు కాల్పులు జరగలేదని అంటున్నారు. ఒకరి మృతిని పోలీసులు ధ్రువీకరిస్తుండగా, మరో ఇద్దరి మరణాలను ధ్రువీకరించడం లేదు.

కాంగ్రెసు పార్టీ నాయకులపై రాళ్లతో దాడికి దిగిన సందర్భంలో కాల్పులు జరిగాయని అంటున్నారు. కాంగ్రెసు నాయకుల అంగరక్షకులు మాత్రమే కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లోనే ఆందోళనకారులు మరణించారనే వాదన వినిపిస్తోంది. శాసనసభ్యురాలు కొండా సురేఖ వర్గీయులు కాల్పులు జరిపారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

జగన్ యాత్ర నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను చెప్పినా వినకుండా జగన్ యాత్రకు బయలుదేరడం పట్ల ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తాజా పరిస్థితిని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ సమీక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ రాలేదు. మహబూబాబాద్ కు కడప మనుషులు కూడా చేరుకున్నారు. వారు మహబూబాబాద్ రైల్వే స్టేషనులో మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X