వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు: భారత విద్యార్థికి జైలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
మెల్బోర్న్: తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వైధింపులకు పాల్పడిన భారత విద్యార్థికి ఆస్ట్రేలియా కోర్టు మూడేళ్ల 9 నెలల జైలు శిక్ష వేసింది. విద్యనభ్యసిస్తూ సేల్స్ మన్ గా పనిచేస్తున్న 29 ఏళ్ల ముజాహిద్ వుర్ - రెహ్మాన్ అనే విద్యార్థితి నిరుడు సెప్టెంబర్ 30వ తేదీన ఆ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫాక్స్ టెల్ అనే టెలివిజన్ సర్వీస్ కంపెనీలో సేల్స్ మన్గా పనిచేస్తున్ రహ్మాన్ బాలిక సోదరుడి ఎదుటే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎఎపి అనే వార్తా సంస్థ తెలిపింది.

నేరం రుజువు కావడంతో విక్టోరియా కౌంటీ కోర్టు న్యాయమూర్తి పాల్ లకావా ఆ విద్యార్థికి జైలు శిక్ష వేశారు. రెండేళ్ల మూడు నెలల శిక్ష పూర్తయ్యే వరకు పెరోల్ ఇవ్వకూడదని లకావా ఆదేశించారు. రెహ్మాన్ ఇప్పటి వరకు 243 రోజులు జైలులోనే ఉన్నాడు. దీన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష అమలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. హాస్పిటాలిటీలో మేనేజ్ మెంట్ డిప్లమా చేసేందుకు 2008 అక్టోబర్ లో రెహ్మాన్ ఆస్ట్రేలియా వచ్చాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X