వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పై కాల్పులు, హత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Sri Ravi Shankar
బెంగళూరు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జరిగిన ఈ హత్యాయత్నం నుంచి రవిశంకర్ తృటిలో తప్పించుకున్నారు. బెంగళూర్ లోని కనకపుర రోడ్డులో గల ఆశ్రమంలో ప్రసంగించి బయటికి వచ్చినప్పుడు రవిశంకర్ కారుపై గుర్తు తెలియని సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి రవిశంకర్ తప్పించుకున్నాడు. అయితే వినయ్ అనే భక్తుడు గాయపడ్డాడు. అతని తొడలోంచి బుల్లెట్ దూసుకుపోయింది.

ఆశ్రమంలోని యాగశాలలో జరిగిన సత్సంగ్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఇన్నోవా కారులో రవిశంకర్ ఎక్కారు. ఆ సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు రామనగరం డిప్యూటీ సూపరింటిండెంట్ దేవరాజ్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X