వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడులకు భయపడను, నా వద్దకు రా: రవిశంకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Sri Ravi Shankar
బెంగళూరు: తాను దాడులకు భయపడబోనని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. తనపై దాడి ఆగంతకుడిని ఆయన తన ఆశ్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తనతో కొంత సమయం గడిపితే ఆ వ్యక్తి మారిపోతాడని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనకు శత్రువులు లేరని, తన జీవితంలో ఏనాడు దుర్మార్గం పనులు చేయలేదని ఆయన అన్నారు.

శాంతి, అహింసల ద్వారా మాత్రమే ఇటువంటి సంఘటనలకు స్వస్తి చెప్పగలుగుతామని ఆయన అన్నారు. భక్తుల భద్రతకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని, అయితే అదే సమయంలో దాడులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందని ఆయన అన్నారు. శ్రీశ్రీ రవిశంకర్ యథావిధిగా ఉదయం ప్రార్థనలు చేశారని ఆశ్రమ సిబ్బంది అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X