విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాయ్ ల్యాండ్ కన్నా మిన్నగా విజయవాడలో పర్యాటకం

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడ నగరం గొప్ప పర్యాటక కేంద్రంగా మారనుంది. నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, హాయ్‌ల్యాండ్‌ తరహా ఏర్పాట్లు చేయడానికి కృషిచేస్తున్నామని మునిసిపల్‌ కమిషనర్‌ జీ రవిబాబు చెప్పారు. మంగళవారం బస్‌స్టేషన్‌లో చినకాకాని హాయ్‌ల్యాండ్‌కు మెట్రోబస్సు సర్వీసులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవిబాబు మాట్లాడుతూ సింగ్‌నగర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. నగరంలో రాజీవ్‌పార్క్‌, రాఘవయ్యపార్క్‌, కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన దుర్గమ్మ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని చెప్పారు. వారు పర్యాటక కేంద్రాలన్నీ సందర్శించే విధంగా నగరంలో హాయ్‌ల్యాండ్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

నగరంలో డిసెంబర్‌, జనవరి నెలల్లో బీఆర్టీఎస్‌ బస్సులు నడుస్తాయని మునిసిపల్‌ కమిషనర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ సమర్థవంతంగా చేపట్టగలదన్నారు. నగరంలో బీఆర్‌టీఎస్‌ బస్సులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన అన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నుంచి హాయ్‌ల్యాండ్‌కు మూడు మెట్రో బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామన్నారు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ మీదుగా హాయ్‌ల్యాండ్‌కు ప్రతి అరగంటకు ఒక బస్సు నడుపుతామని చెప్పారు. ఉదయం 7.30 గంటలకు నగరంలో మొదటి బస్సు బయలుదేరుతుందని, రాత్రి 10.30 గంటలకు హాయ్‌ల్యాండ్‌ నుంచి లాస్ట్‌బస్‌ బయలుదేరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ రఘునాథ్‌, హాయ్‌ల్యాండ్‌ ఎండీ ఆలూరి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X