హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయసుధపై హైదరాబాద్ మేయర్ ఎదురుదాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: తనపై ఆరోపణలు చేసిన సికింద్రాబాద్ శాసనసభ్యురాలు, సినీ నటి జయసుధపై హైదరాబాద్ మేయర్ బండ కార్తిక రెడ్డి ఎదురు దాడికి దిగారు. తన భర్త వార్డు కమిటీ సభ్యుల ఎన్నికలో జోక్యం చేసుకుంటున్నారనే జయసుధ ఆరోపణపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులో 52 మంది మహిళా కార్పొరేటర్లున్నారని, వారి భర్తలందరూ జోక్యం చేసుకుంటున్నారని, తన భర్త ఒక్కరే జోక్యం చేసుకోవడం లేదని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

జయసుధ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే తాను కూడా చేస్తానని ఆమె అన్నారు. జయసుధ ఇచ్చిన పేర్లపై తాను వివరణ ఇచ్చానని ఆమె చెప్పారు. కార్తిక రెడ్డిపై జయసుధ విరుచుకుపడిన విషయం తెలిసిందే. కార్తిక రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు. తానో, ఆమెనో ఎవరో ఒకరం మాత్రమే ఉండాలని ఆమె సవాల్ చేసారు. తాను సూచించిన పేర్లు లేకపోతే రాజీనామా చేస్తానని జయసుధ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X