వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీలో సెక్స్ కుంభకోణం: నందా రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

LT Gen Ak Nanda
న్యూఢిల్లీ: భారత సైన్యంలో సెక్స్ కుంభకోణం కలకలం రేపింది. గత నెల విదేశీ పర్యటన సందర్భంగా అధికారి భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణపై లెఫ్టినెంట్ జనరల్ ఒకతను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎకె నందా తన సాంకేతిక కార్యదర్శి భార్యపై లైంగిక అత్యాచారానికి ప్రయత్నించాడనే ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆర్మీ చీఫ్ వికె సింగ్ ఆదేశం మేరకు ఎకె నందా రాజీనామా చేశారు.

లైంగిక దుష్ప్రవర్తనపై రాజీనామా చేసిన అధికారుల్లో ఎకె నందా అత్యంత సీనియర్ కావడం విశేషం. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎకె నందా, ఆయన ప్రతినిధులు గత నెల ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. సాంకేతిక కార్యదర్శి భార్య ఆర్మీ చీప్ భార్య, సైనికుల భార్యల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు భారతి సింగ్ కు నందాపై ఫిర్యాదు చేసింది. దీంతో వికె సింగ్ నందాపై చర్యకు ఉపక్రమించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X