వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుష్క సరోజ పాత్రపై అమలాపురం ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anushka Shetty
రాజమండ్రి: రొటీన్ కు భిన్నంగా వచ్చిన వేదం సినిమా ఓ ప్రాంతం ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కుంటోంది. హీరోయిన్ అనుష్క పోషించిన వేదం చిత్రంలోని పాత్రకు అమలాపురం సరోజ అని పేరు పెట్టడాన్ని అమలాపురం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చెడు పాత్రలకు తమ ప్రాంతం పేరును పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. మంచి పేరు పెడితే ఎవరైనా అహ్వానిస్తారు గానీ చెడు పేరు పెడితే ఎలా సహిస్తారని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు వంగా గీత కూడా ప్రశ్నిస్తున్నారు.

అమలాపురంలో అమ్మాయిలు మాత్రమే ఉంటారన్నట్లు సినిమాలో చూపించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం సరోజ హైదరాబాదులో వేశ్యావృత్తి బాగా సాగుతుందని అక్కడి నుంచి పారిపోయి వస్తుంది. ఆమె కథ అంతా హైదరాబాదులోనే సాగుతుంది. మొత్తంమీద అమలాపురం సరోజ పాత్ర తమ మనోభావాలను దెబ్బ తీసేదిగా ఉందని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X