బాసర: కిక్కిరిసిన భక్తులతో బాసర పుణ్యక్షేత్రం కళకళలాడుతోంది. బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో భక్తులు వెల్లువెత్తారు. వేలాదిమంది ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాలలు తెరిచే సమయం కావటంతో తమ చిన్నారులకు ముందుగా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించటం కోసం వీరంతా తరలిరావటంతో బాసర కిటకిటలాడుతోంది.
కాగా తిరుమలలో కూడా రద్దీ పెరిగింది. తిరుమలలో భక్తుల కంపార్టుమెంట్లన్నీ నిండి బయట ఉన్న క్యూలైన్లలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.