హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు కాంగ్రెసు సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణలో 12 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెసు పార్టీ అధికారికంగా వెల్లడించింది. తద్వారా తెరాసకు సవాల్ విసరడానికి కాంగ్రెసు సిద్ధపడింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులు శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానాల్లో రాజీనామా చేసిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు చాలా మంది కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, పార్టీ అధిష్టానం నిర్ణయంతో పోటీకి దిగాలని రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీయే అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించింది. దీంతో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు కాంగ్రెసు సవాల్ విసురుతున్నట్లే. కాంగ్రెసు నిర్ణయంతో తెరాస వర్గాల్లో అలజడి మొదలైంది. ఇంత వరకు ఏ పార్టీ కూడా పోటీ చేయదని భావించిన తెరాసకు కాంగ్రెసు నిర్ణయం ఓ రకంగా పిడుగుపాటు లాంటిదే. కానీ, దాన్ని సవాల్ గా స్వీకరించి కాంగ్రెసును తిప్పికొట్టాలనే ఉద్దేశంతో తెరాస ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X