హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికలకు కెసిఆర్ వ్యూహ రచన

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణలోని శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు పార్టీ నాయకులను, కార్యకర్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమాయత్తం చేస్తున్నారు. ఇందుకుగాను ఆయన మంగళవారం పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. తెరాస శాసనసభ్యులు పది మంది, బిజెపి సభ్యుడు ఒకరు, తెలుగుదేశం సభ్యుడు ఒకరు రాజీనామా చేయడం వల్ల మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజీనామా చేసిన తెలుగుదేశం శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ తెరాసలో చేరారు. నిజామాబాద్ శాసనసభ్యత్వానికి బిజెపికి చెందిన లక్ష్మినారాయణ రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జరిగే ఎన్నికలో లక్ష్మినారాయణపై పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తలపడే అవకాశాలున్నాయి. మిగతా 11 స్థానాల్లో తెరాస అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు.

మొత్తం 12 స్థానాల్లోనూ కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెసు నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగే యోచనలో ఉంది. దీంతో ఉప ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పేట్లు లేదు. ఈ స్థితిలో ఆ రెండు పార్టీలను ఎదుర్కోవడానికి కెసిఆర్ పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థులను అడుగడుగునా అడ్డుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. నామినేషన్లు వేయకుండా తెలుగుదేశం, కాంగ్రెసు అభ్యర్థులను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X