హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ టీడీపీయే ఉండదని, కాంగ్రెస్, టీఆర్ఎస్ మాత్రమే మిగులుతాయని చెప్పారు. తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడారు. తెలంగాణలో ఎప్పటికైనా కాంగ్రెసుకు తెరాసయే గట్టి పోటీ అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసుతో సహా ఏ పార్టీతోనూ తాము ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. పొత్తుల ఆలోచన లేకుండా పార్టీ సభ్యత్వ నమోదుపై శ్రద్ధ చూపాలని, గ్రామాల వారీగా బలంగా ఉంటేనే కాంగ్రెసుకు గట్టి పోటీ ఇవ్వగలమని చెప్పారు. టీడీపీ టైం దగ్గరపడిందని, ఇప్పటికే ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్‌ లోకి పెద్దఎత్తున వలసలు సాగుతున్నాయని, దీనిని మరింత పెంచాలన్నారు.

కాంగ్రెసు నుంచి కూడా వలసలను ప్రోత్సాహించాలని ఆయన చెప్పారు. సమీప భవిష్యత్తు తెరాసదేనని, ఒకటి తర్వాత మరొకటి వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. ఈమేరకు పార్టీ నిర్మాణ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. జూన్ 20 వరకు సభ్యత్వ నమోదు లక్ష్యాలను పూర్తి చేసుకొని, వెనువెంటనే ఉప ఎన్నికల రంగంలో దిగాలని చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేస్తే చేయనీ, దాని సంగతి తెలంగాణ జెఎసి, ప్రజలు చూసుకుంటారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగే 12 స్థానాల్లో టిడిపికి క్యాడరే లేదని, వారంతా తమ పార్టీలో చేరారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X