హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ ఆర్టిస్టులపై దాడి కేసులు: నాగరాజు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: టీవీ ఆర్టిస్టులపై దాడి కేసుల్లో పోలీసులు నాగరాజు అనే యువకుడిని శనివారం అరెస్టు చేశారు. టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై ఇటీవల హైదరాబాద్ సమీపంలోని కూకట్ పల్లిలో యాసిడ్ దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అలాగే మర్నాడు డింపుల్ అనే మరో టీవీ ఆర్టిస్టుపై మణికొండలో దాడి జరిగింది. ఓ తెలుగు టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగరాజు అనే యువకుడు శ్రీధర్ వర్మపై దాడి చేసినట్లు అంగీకరించాడు. అయితే తాను నీళ్ల బాటిల్ తో మాత్రమే దాడి చేశానని, యాసిడ్ దాడి చేయలేదని చెప్పుకున్నాడు.

డింపుల్ పై మాత్రం తాను దాడి చేయలేదని అతను చెప్పాడు. సీరియల్ లో తాను అసిస్టెంట్ గా పని చేస్తుంటానని, సెల్వరాజ్ ను తీసేసి శ్రీధర్ వర్మను సీరియల్ లోకి తీసుకోవడం తనకు నచ్చలేదని అతను అన్నాడు. సెల్వరాజ్ ను తొలగించడానికి గల కారణాన్ని అడగడానికి శ్రీధర్ వర్మను సంప్రదించానని, అయితే శ్రీధర్ తనతో మాట్లాడడానికి ఇష్టపడలేదని, దాంతో తనకు కోపం వచ్చి నీళ్ల బాటిల్ తో దాడి చేశానని నాగరాజు చెప్పుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X