కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దివ్యశక్తులున్నాయి, శాంభవిని స్కూల్ కు పంపం: ఉషారాణి

By Pratap
|
Google Oneindia TeluguNews

Shambhavi
కర్నూలు: శాంభవిని ఏ పాఠశాలలోనూ చేర్చే ప్రసక్తి లేదని ఆమె తల్లి ఉషారాణి మొండికేస్తోంది. శాంభవిని పాఠశాలలో చేర్చాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆదేశించారు. శాంభవికి మానవాతీత శక్తులున్నాయంటూ హడావిడి చేస్తూ ఆమెను బాల్యానికి దూరం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం శాంభవిని పాఠశాలలో చేర్చాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అయితే శాంభవికి దైవ శక్తులున్నాయని, ఆమెను పాఠశాలకు పంపేది లేదని ఉషారాణి మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శాంభవిని రెండు వారాల క్రితమే వేద పాఠశాలలో చేర్చామని ఆమె చెప్పారు. శాంభవి ధర్మశాలలోనే ఉంటూ వేదాధ్యయనం చేస్తుందని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X