హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ ఫలితాలు:ఇంజనీరింగ్ బాలురు, మెడిసిన్ లో బాలికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

EAMCET Results released
హైదరాబాద్‌: ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఎంసెట్‌-2010 ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ బుధవారం ఉదయం విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు హవా కొనసాగగా, మెడిసిన్ విభాగంలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజ ఇంజనీరింగ్‌ విభాగంలో 3,16,083 మంది పరీక్ష రాయగా, 2,80,396 మంది అర్హత సాధించారు. మెడిసన్ ‌లో 51, 186మంది పరీక్ష రాయగా, 47,936 మంది అర్హత సాధించారు.

విజయవాడకు చెందిన బోయపాటి పల్లవి(159) ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రధమ స్థానం సాధించగా, విశాఖకు చెందిన మహ్మద్‌ గౌస్‌, గుంటూరుకు చెందిన జనార్థన్ ‌రెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మెడిసిన్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఎన్‌.రాహుల్‌(156) మొదటి ర్యాంకు సాధించగా, రావినూతల లలిత, నారపనేని కిరణ్మయిలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. 88.75 శాతం మంది ఇంజనీరింగ్‌ లో అర్హత సాధించగా, మెడిసిన్ ‌లో 93.7శాతంమంది అర్హత సాధించారు. నెల 26 మార్కుల రీ-వాల్యూషన్‌, రీ-వెరిఫికేషన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ. జూలై మూడోవారం నుంచి ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X