• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రియల్ సీరియల్: టివీ ఆర్టిస్టు డింపుల్ పై కొరడా

By Pratap
|

Dimple
హైదరాబాద్‌: నిజ జీవితంలో కూడా నటించిన టీవీ ఆర్టిస్టు డింపుల్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాడుల డ్రామాను రక్తి కట్టించడానికి ప్రయత్నించి పోలీసుల చేతికి చిక్కిన డింపుల్ ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది. అయితే ఆమెపై కఠినంగా వ్యవహరించాలని టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ నిర్ణయించింది. ఆమెపై నిషేధం విదించింది. ఏ టీవీ కార్యక్రమంలోనూ ఆమెకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది.

టీవీ ఆర్టిస్టుల సంఘం నిర్ణయాన్ని సినీ నిర్మాతల మండలి ప్రతినిధి తమ్మారెడ్డి భరద్వాజ కూడా హర్షించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో డింపుల్ కు స్థానం ఉండదని ఆయన చెప్పారు. సినిమా అవకాశాలు కూడా ఆమెకు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై దాడి చేయించడమే కాకుండా, ఆ దాడి కేసును మరో టీవి ఆర్టిస్టు సెల్వరాజ్ పైకి నెట్టేందుకు ప్రయత్నించినందుకు డింపుల్ కు తీవ్రమైన దెబ్బ తగిలింది.

డింపుల్ తీరుపై సెల్వరాజ్ తీవ్రంగా మండిపడుతున్నాడు. డింపుల్ పై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెబుతున్నారు. తన అవకాశాల కోసం డొంక తిరుగుడు పద్దతిలో వ్యవహరించడం గానీ, సహ టీవీ ఆర్టిస్టులపై ఆగ్రహంతో గానీ ఏనాడు వ్యవహరించలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X