నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు కస్టడీలో ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు నగర ట్రాఫిక్‌ పోలీసుల కస్టడీలో ఓ ఆటోడ్రైవర్‌ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి కనకమహల్‌ సెంటర్‌ వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఆటోలు దెబ్బతినడంతో డ్రైవర్లు ఇద్దరు గొడవపడ్డారు. అటుగా వచ్చిన పోలీసులు ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

పోలీసు స్టేషనుకు తరలించిన కొద్దిసేపటికే అతను పోలీస్‌ స్టేషన్‌ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినా విషయాన్ని బయటకుపొక్కకుండా పోలీసులు జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. దీంతో నెల్లూరు పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X