వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్రాట్ దహాల్ ను పెళ్లాడిన మనీషా కొయిరాల

By Pratap
|
Google Oneindia TeluguNews

Manisha Koirala
ఖాట్మండు: బాలీవుడ్‌ నటి, నేపాలీ సుందరి మనీషా కొయిరాలా(41)కు పెళ్లయిపోయింది. ఖాట్మండుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకర్ణ అటవీ రిసార్టులో శుక్రవారం సమ్రాట్‌ దహాల్‌ (34)తో ఆమె వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. పసుపుపచ్చ చీర ధరించిన మనీషా పండితులు వేద మంత్రులు చదువుతుండగా సమ్రాట్‌ మెడలో దండవేశారు. అనంతరం వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

సుమన్‌ రాజనాథన్‌, నటుడు గోవిందా సతీమణి సునీతా వివాహ వేడుకకు హాజరయ్యారు. విందులో నేపాల్‌, భారత్‌, కాంటినెంటల్‌ వంటకాలను వడ్డించారు. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకల్లోని ప్రధాన కార్యక్రమం శనివారం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం - పూజా కార్యక్రమాలు నిర్వహించాక వధువు వరుడి ఇంటికి వెళుతుంది. ఆదివారం జరిగే భారీ విందు కార్యక్రమానికి 3వేల మంది అతిథులను ఆహ్వానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X