వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మోకాలికి గాయం

By Santaram
|
Google Oneindia TeluguNews

Narayana Murthy
బెంగళూరు: తన విలాస రహిత జీవితం ద్వారా మీడియా దృష్టిలో ఎప్పుడూ ఉండే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గాయపడ్డారు. నారాయణమూర్తి ఇటీవల ఓ పర్యటనలో ఉండగా మోకాలికి గాయమైంది. దీంతో పర్యటనలు తగ్గించుకోవాలని వైద్యులు సూచించినట్లు సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థులు శనివారం ఏర్పాటు చేసిన సదస్సులో నారాయణమూర్తి ప్రసంగించాల్సి ఉంది. అదే కళాశాల పూర్వవిద్యార్థి అయిన నారాయణమూర్తి స్వల్ప అనారోగ్యం వల్ల బెంగళూరులో జరిగిన సదస్సులో పాల్గొనలేకపోయారు.

దీంతో ఇన్ఫోసిస్‌ సీఈవో గోపాలకృష్ణన్‌ నారాయణమూర్తి బదులు సదస్సులో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నారాయణమూర్తికి రెండు, మూడు వారాల క్రితం మోకాలికి గాయమైందని..అందుకే ఆయన రాలేకపోయారని చెప్పారు. ఎక్కువగా పర్యటనలు చేయొద్దని వైద్యులు సూచించినట్లు వివరించారు. భారత ఐటీ పరిశ్రమలో దిగ్గజమైన నారాయణమూర్తి వివిధ వర్సిటీల్లో ఉపన్యసించేందుకు తరచూ విదేశాలకు వెళ్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X