కర్నూలు: విచిత్ర వేషధారణలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టే కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కర్నూలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజ్యసభ సీటు విషయమై ఆయన గత నెలరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ చర్యకు పూనుకోవడం కర్నూలు నగరంలో సంచలనం రేపింది.
బంగి అనంతయ్య వివిధ వేషధారణలతో ప్రభుత్వ విధానాలపై ఎడతెరిపి లేకుండా సమరం సాగిస్తూ వస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సీటును ఆశించారు. అయితే ఆయనకు నిరాశే ఎదురైంది. గతంలో ఓసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై విమర్సలు కూడా చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు లేదంటూ ఆయన విరుచుకుపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి