హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణ టూర్ పై దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలంగాణ పర్యటనపై దుమారం చెలరేగుతోంది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోశయ్య పర్యటనను అడ్డుకుంటామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ప్రకటన వివాదానికి తెర తీసింది. ఒయు జెఎసి నిర్ణయాన్ని మంత్రులు, శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు కూడా ఒయు జెఎసి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. రోశయ్య పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణలో అభివృద్ధిని నిరోధించడమేనని సమాచార, పౌర సంబంధాల మంత్రి జె. గీతారెడ్డి ఇదివరకే ప్రకటించారు.

తాజాగా, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఒయు జెఎసి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సెంటిమెంట్ల ప్రకారం రాష్ట్ర పాలన జరగాలంటే కుదరదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. సెంటిమెంట్లు అంగీకరిస్తే ఒక్కో ప్రాంతం వాళ్లు ఒక్కొ రాష్ట్రం అడుగుతారని ఆయన సోమవారం అనంతపురంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తెలంగాణలో పర్యటించడం ఇష్టం లేకపోతే నిరసన తెలపాలేగానీ అడ్డుకుంటామనడం సబబుకాదన్నారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తెలంగాణలో ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన ఆగదని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనను అడ్డుకుంటామని తెరాస, ఓయూ ఐకాస చెప్పడం అర్ధరహితమని ఆయన సోమవారం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పర్యటననే అడ్డుకోవడం తగదని ఆయన హితవు పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X