హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జిహెచ్ ఎంసి టౌనింగ్ ప్లానింగ్ అధికారి ఆస్తులు పది కోట్లపైనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ (జిహెచ్ ఎంసి) లో టౌనిప్లానింగ్‌ అధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోదాలు నిర్వహించారు. చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌ వద్ద నాగేశ్వరరావు నివాసంలో దాదాపు రూ.10కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు సమాచారం.

నాగేశ్వర రావు పేరు మీద ఏడు, అతని భార్య పేరు మీద 17 ఇంటి స్థలాలు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. నాగేశ్వర రావు ఇంటిలో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, లక్షల రూపాయల నగదు దొరికింది. అతనికి హైదరాబాదులోనూ హైదరాబాదు శివారులోనూ స్థలాలు, అపార్టుమెంట్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. నాగేశ్వర రావు గత 25 ఏళ్లుగా సర్వీసులో ఉన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X