హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలకు యాక్షన్ ప్లాన్: డిజిపి గరీష్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Girish Kumar
హైదరాబాద్‌: ఉప ఎన్నికల ప్రచారంలో ఎవరైనా శాంతియుతంగా పాల్గొనవచ్చని డీజీపీ గిరీష్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే జిల్లాల అధికారులతో డీజీపీ గిరీష్ ‌కుమార్‌, ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్ధతులకు ఆటంకం కలిగించినవారిపై చర్యలు తప్పవని డిజిపి హెచ్చరించారు. అవసరమైతే ముందస్తు అరెస్టులు చేస్తామన్నారు. ఉప ఎన్నికలు జరిగే 5 జిల్లాల్లో ఎన్నికలకు 80 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తామని ఐవీ సుబ్బారావు అన్నారు. నియోజకవర్గాల్లో పర్యటనకు వస్తే రాళ్లు వేస్తాం లాంటి మాటలు, చేతలు చేస్తే చర్యలు తప్పవని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో ఎవరైనా పాల్గొనవచ్చునని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసి, ఉద్రిక్త వాతావరణం సృష్టించవద్దని ఆయన కోరారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 2,281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐవి సుబ్బారావు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X