వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామన్ వెల్త్ క్రీడాజ్యోతి కాగడాకు ఘన స్వాగతం

By Santaram
|
Google Oneindia TeluguNews

CWG 2010: Queen's Baton arrives in India
న్యూఢిల్ల్లీ: విశ్వవ్యాప్తంగా 71 దేశాల్లో పయనించిన క్వీన్స్ బేటన్ 2010 వాఘా సరిహద్దు ద్వారా శుక్రవారం ఉదయం భారత్ చేరుకుంది. ఈ కామన్ వెల్త్ క్రీడా జ్యోతికి ఘనస్వాగతం పలికేందుకు పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు, నాయకులు, క్రీడాకారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ హాసన్ ఈ క్రీడా జ్యోతిని భారత్ కామన్ వెల్త్ క్రీడా ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీకి అందజేశారు.ఈ సందర్భంగా సురేష్ కల్మాడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలగుండా ఈ క్రీడా జ్యోతి యాత్రను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు 71 దేశాలలో పర్యటించి ఈరోజు భారత్ చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 2010లో జరిగే కామన్‌వెల్త్ క్రీడల కోసం ఈ జ్యోతిని గత అక్టోబర్ 29న క్విన్ ఎలిజిబెత్ 2 లండన్‌లో ప్రారంభించిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X