హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ ప్రభుత్వం నుంచి తిరుమల శ్రీవారే రక్షించుకుంటాడు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామే తనను తాను రక్షించుకుంటాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమలలోని వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు. నాస్తికులను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలిలో వేశారని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తులు, చర్చిలు, దేవాలయాల టికెట్లతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారు ఈ ప్రభుత్వాన్ని శిక్షిస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.

కర్నాటక ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన ఆల్మట్టిపై వాదనలు సమర్థంగా వినిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే కృష్ణా ట్రిబ్యునల్ కర్నాటకకు అనుకూలంగా తీర్పు చెప్పిందని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు ఎక్కువగా ఉందనే విషయంలో తాము గతంలో అప్పటి ప్రధాని దేవెగౌడపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామని ఆయన చెప్పారు. కృష్ణా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే హక్కు ఉంటుందని, ఆ జలాలపై ఆధారపడి ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను తలపెట్టిందని ఆయన చెప్పారు.

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టులను ఆపించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బాబ్లీ విషయంలో ఏమీ చేయడం లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై తాము పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X