హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణదేవరాయల పాలన ఎప్పటికీ ఆదర్శం: రాష్ట్రపతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
హైదరాబాద్‌: ఆంధ్ర, కర్ణాటక పాలకుడు శ్రీకృష్ణదేవరాయల పాలన నాడే కాదు నేటికీ ఆదర్శనీయం, ఆచరణీయమని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ప్రశంసించారు. శ్రీకృష్ణ దేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆమె తెలుగు భాషలో పలకరించి అందరినీ అలరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా ఆ కాలంలోనే రాయలవారు చెరువులు, కాలువలు విరివిగా తవ్వించి సుభిక్షంగా ఉంచారన్నారు.

ఆయన పాలనా యంత్రాంగం తీరు ఇప్పటికీ మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుందన్నారు. సామ్రాజ్య విస్తరణే కాకుండా ప్రజల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన సాటిలేని పాలకుడిగా పేరు పొందారని అన్నారు. ప్రజల మనస్సులను గెలుచుకున్న ఆయన పంచశతాబ్ది ఉత్సవాలను నిర్వహించ తలపెట్టినందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ఆమె అభినందించారు. ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

అంతకుముందు గవర్నర్‌ నరసింహన్‌ కృష్ణదేవరాయల గొప్పతనాన్ని గుర్తు చేశారు. సీఎం ప్రసంగిస్తూ మన ప్రాంతాన్ని పరిపాలించారు కనుక కృష్ణదేవరాయల పట్టాభిషేక ఉత్సవాలను జరపటం లేదని ప్రజల మనస్సులు గెలుచుకున్న గొప్ప పాలకుడు కనుక జరుపుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా మాట్లాడారు. జె. గీతారెడ్డి తదితర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రతిభా పాటిల్ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X