హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను: సోంపేట ఘటనపై రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాదు వెళ్లి వివరాలు తెలుసుకుంటే తప్ప ఏమీ చెప్పలేనని ముఖ్యమంత్రి కె. రోశయ్య సోంపేట ఘటనపై అన్నారు. నక్సల్స్ సమస్యపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వచ్చారు. నిలుచున్న చోటనే నిర్ణయాలు ప్రకటించడం తన వల్ల కాదని ఆయన అన్నారు. తాను హోం మంత్రితో, జిల్లా కలెక్టర్ తోనూ, ఇతరులతోనూ మాట్లాడానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఏమైనా జరిగిన సంఘటన దురదృష్ణకరమని ఆయన అన్నారు. ఘటనలో పోలీసులు గాయపడ్డారని ఆయన అన్నారు. తనకు అందిన సమాచారం మేరకు సంఘటనలో ఒక్కరే మరణించాడని ఆయన అన్నారు.

కాగా, సోంపేట ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం హైదరాబాదులో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారని, దాడిలో 25 మంది పోలీసులు గాయపడ్డారని ఆయన అన్నారు. కాల్పుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే మరణించినట్లు ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మృతుడి శవంతో ఆందోళనకారులు పోలీసు స్టేషను వద్ద ధర్నా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులను వెనక్కి రావాలని పిలిచినట్లు ఆమె చెప్పారు. సంయమనం పాటించాలని పోలీసులను ఆదేశించామని ఆమె చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆమె అన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X