వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక సిఎం యెడ్యూరప్పకు గాలి బ్రదర్స్ భయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు గాలి సోదరుల భయం పట్టుకుంది. బిజెపిని చీల్సి ప్రభుత్వాన్ని పడుగొడుతారమోననేది ఆయన భయం. మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ పై యుద్ధం ప్రకటించిన కాంగ్రెసు పార్టీ రాష్ట్ర శాసనసభ సమావేశాలను పట్టుమని అర గంట కూడా నడవనీయడం లేదు. గాలి బ్రదర్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల సభ్యులు శాసనసభలోనే నిద్రాహారాలు చేస్తున్నారు. గాలి సోదరులకు 30 నుంచి 40 మంది శాసనసభ్యులున్నారు. ఇంతకు ముందు యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ శాసనసభ్యులతోనే వారు ప్రయత్నాలు చేశారు. దీంతో బిజెపి జాతీయ నాయకత్వం కూడా దిగి వచ్చింది. పార్టీ అంతర్గత వ్యవహారం కావడంతో అప్పుడు చక్కదిద్దుకో గలిగారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.

ప్రతిపక్షం గాలి సోదరుల అక్రమ మైనింగ్ పై ఆరోపణలు సంధిస్తూ యెడ్యూరప్ప ప్రభుత్వంపై కాంగ్రెసు యుద్ధం ప్రకటించింది. కర్నాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ కూడా గాలి సోదరులపై కత్తి కట్టారు. వారిని మంత్రివర్గం నుంచి తప్పించే వరకు ఆగేది లేదని ఆయన అంటున్నారు. దీంతో యెడ్యూరప్ప ప్రభుత్వంపై కత్తి వేలాడుతోంది. గాలి సోదరులపై చర్యలు తీసుకునే ధైర్యం యెడ్యూరప్ప చేయలేని స్థితిలో ఉన్నారు. చర్యలు తీసుకుంటే గాలి సోదరులు తమకు మద్దతిస్తున్న 30, 40 మంది సభ్యులతో యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉంది. బిజెపి ప్రభుత్వానికి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X