వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు గొడవ: అశోక్ చవాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ashok Chavan
న్యూఢిల్లీ: రాజకీయ లబ్ది కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాబ్లీపై పోరాటమంటూ ఆందోళన చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను విడివిడిగా కలుసుకున్న ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాబ్లీ వద్దకు చంద్రబాబునే కాదు, ఎవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నాయకుల అరెస్టు వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు అనవసరంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బాబ్లీ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, తాము కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X