• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబ్లీపై రోశయ్య విజ్ఞప్తిని పట్టించుకోని అశోక్ చవాన్

By Pratap
|

Ashok Chavan
ముంబై: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బాబ్లీ ప్రాజెక్టును చూపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బేఖాతరు చేశారు. బెయిల్ తీసుకుని వెనక్కి వెళ్లిపోవాలని చవాన్ చంద్రబాబుకు సూచించారు. ఈ ప్రాంతంలో నెలకొన్న సున్నితమైన పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఉప ఎన్నికల నేపథ్యంలో సమస్యను రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. వెనక్కి వెళ్లకపోతే కస్టడీ పొడగింపు తప్పదని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. చట్టాలను ఉల్లంఘించి తమ రాష్ట్రంలోకి చంద్రబాబు ప్రవేశించడం, ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునివ్వడం సరి కాదని ఆయన అన్నారు. బాబ్లీ అంశం కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X