హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బాబ్లీ పోరుకు కాంగ్రెస్ నేత జానారెడ్డి మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: బాబ్లీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి మాజీ మంత్రి, కాంగ్రెసు నేత కె. జానా రెడ్డి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. బాబ్లీ ప్రాజెక్టు పరిశీలనకు తెలుగుదేశం నాయకులు వెళ్లడం తప్పు కాదని ఆయన అన్నారు. బాబ్లీపై అన్ని పార్టీలు చంద్రబాబుకు మద్దతు పలకాలని ఆయన కోరారు. జాతీయ పార్టీగా కాంగ్రెసు బాబ్లీ అంశాన్ని వదిలేయలేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షల కోసం పని చేస్తోందని ఆయన అన్నారు. బాబ్లీపై తెలుగుదేశం ఉప ఎన్నికల దృష్టితోనే పోరాటం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జానారెడ్డి అన్నారు. బాబ్లీ వివాదం ఉప ఎన్నికలపై ప్రభావం చూపబోదని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ బాబ్లీ అంశాన్ని వదిలిపెట్టలేదని చెప్పారు. అఖిలపక్షం ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సహకరించాలని అన్నారు. తెలంగాణ సాధన కోసం తమతో కలసి రావలని ఆయన తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ను ఆహ్వానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X