అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహారాష్ట్ర సిఎం అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటన రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ashok Chavan
అనంతపురం‌: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటన రద్దయింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అనంతపురం జిల్లా ఎస్పీకి సమాచారం అందించింది. చవాన్ బుధవారం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో సత్య సాయిబాబాను సందర్శించాల్సి ఉంది. అయితే, చంద్రబాబు సహా తెలుగుదేశం నేతల అరెస్టు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిలో నేపథ్యంలో పుట్టపర్తి రావద్దని సత్యసాయి ట్రస్టు చవాన్ కు సూచించింది. తొలుత ఆ సూచనను పట్టించుకోకుండా చవాన్ పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు.

అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకు ముందు ప్రకటించారు. బుధవారం పుట్టపర్తి రానున్న ఆయనను ఎయిర్‌పోర్టు దగ్గర అడ్డుకుని, ఎలాంటి పరిస్థితుల్లో జిల్లాలోకి అడుగు పెట్టనీయకూడదని తెలుగుదేశం నాయకులు నిర్ణయించారు. ఈమేరకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి, కార్యకర్తలను మోహరించేందుకు సిద్ధపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X