వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నాయుడు బృందాన్ని ఔరంగాబాద్ తరలిస్తున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ధర్మాబాద్: తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు బృందాన్ని మహారాష్ట్ర పోలీసులు ఔరంగాబాద్ తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వదిలేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉండడం వల్ల అలా వదిలేయడం వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో వారిని ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం ప్రజాప్రతినిధులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. దానికి ముందు లాఠీచార్జీ కూడా చేశారు. వారి వ్యక్తిగత సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కు పంపించి వేశారు.

వాహనాల్లో ఎక్కించడానికి ముందు చంద్రబాబు మహారాష్ట్ర పోలీసుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులను అందరినీ ఔరంగాబాద్ తరలిస్తారా, కొంత మందిని నాందేడ్ జైలులో పెడతారా అనేది తెలియడం లేదు. వారిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడం లేదు. తెలుగుదేశం నాయకులను వాహనాల్లోకి ఎక్కించే ముందు ధర్మాబాద్ ఐటిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X