• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా భక్తురాలు రంజితకెంత కష్టం వచ్చింది: నిత్యానంద జాలి

By Pratap
|

Nityananda Swami
బెంగళూరు: సినీనటి రంజితపై సెక్స్ స్వామి నిత్యానంద బోలెడు జాలి కురిపించాడు. 'ఆమె నిజాయతీ, వినయం గల భక్తురాలు. ఆశ్రమం కోసం ఆమె స్వచ్ఛందంగా ఎంతో కృషి చేసింది' అని చెప్పాడు. తనకు ఆమెకు మధ్య ఉన్న సంబంధం బోధకునికి-భక్తురాలికి మధ్య ఉండేదేనన్నాడు.

తనపై వచ్చిన ఆరోపణల కన్నా తన భక్తులకు ముఖ్యంగా రంజితకు జరిగిన అన్యాయమే తనను ఎక్కువగా బాధిస్తోందని అన్నాడు. ఆమెకు ఏమీ తెలియకుండానే దుష్ప్రచారం జరిగిపోయిందని, దానివల్ల రంజిత, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాడు. 'నాపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్లు నాపైనే ప్రత్యక్షంగా దాడి చేసి ఉండాల్సింది. అంతేగానీ నా భక్తురాలి జీవితాన్ని నాశనం చేసి ఉండాల్సింది కాదు' అని అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X