తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మవిశ్వాసం లేకుంటే మెగాస్టార్ ను అయ్యేవాడ్ని కాను: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: ఆత్మవిశ్వాసం లేకుంటే తాను మెగాస్టార్ ను అయి ఉండేవాడిని కానని ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మావతి విశ్వవిద్యాలయం హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన ఆయన శనివారం విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అద్దంలో తన ముఖం చూసుకుని తన అంత అందగాడు మరొకరు ఉండరని అనుకునే వాడిని అని ఆయన అన్నారు. తన లాంటివాడు లేడని అనుకునేవాడ్ని అని ఆయన చెప్పుకున్నారు.

సినీ రంగంలో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నానని, వాటిని చూసి తాను భయపడలేదని ఆయన చెప్పారు. మనపై మనకు నమ్మకం ఉంటేనే విజయం సాధించగలమని ఆయన అన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో పడి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X